Header Banner

దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన.. ఇంజినీరింగ్ ఇన్ఛార్జిగా విజయనగరం కుర్రాడు

  Sun Apr 06, 2025 15:08        Politics

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ వారధి నిర్మాణంలో ఇన్ఛార్జిగా విజయనగరం జిల్లా గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువ ఇంజినీర్ నడుపూరు వెంకట చక్రధర్ కీలక పాత్రధారి. వంతెన నిర్మాణ క్రమంలో ఎదురైన అనుభవాలు, పడ్డ శ్రమను చక్రధర్ 'న్యూస్టుడే'తో పంచుకున్నారు. 'మా అమ్మ శ్రీదేవి, నాన్న పైడిరాజు ఇద్దరూ ఉపాధ్యాయులే. చిన్నతనం నుంచే వంతెనలపై ఆసక్తితో బీటెక్ లో సివిల్ ఇంజినీరింగ్ ఎంచుకున్నా. తర్వాత ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) కోసం శిక్షణ తీసుకునే సమయంలోనే ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఎంపికై, రైల్వేలో బ్రిడ్జి విభాగం ఆప్షనన్ను ఎంచుకుని ఉద్యోగంలో చేరాను. తొలి పోస్టింగ్ చెన్నైలో వచ్చింది. పనితీరు ఆధారంగా త్వరగానే సీనియర్ ఇంజినీర్ గా ఉద్యోగోన్నతి లభించింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

అదే సమయంలో రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించేలా సముద్రంపై నిర్మించిన పాత పాంబన్ వంతెన అవసాన దశకు చేరడంతో, దాని స్థానంలో కొత్తది కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ హోదాలో ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పగించారు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సారథ్యం వహించడం గొప్ప అవకాశంగా భావించాను. వందల మంది నిపుణులు, శ్రామికులు రేయింబవళ్లూ శ్రమించారు. ఏడాది పాటు స్వగ్రామానికి, బంధువుల శుభకార్యాలకూ వెళ్లలేకపోయాను. సెలవుల్లేకుండా పనిచేశాం. మా శ్రమకు ప్రతిరూపంగా పాంబన్ సేతు సాకారమైంది. రైల్వేలో వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి దేశంలో ఇదే మొదటిది. దీని సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకోగా, మిగతా సామగ్రి అంతా దేశీయంగా సమకూర్చుకున్నదే. వంతెన పనులు మొదలు ట్రయల్ రన్ వరకు ప్రతి దశలోనూ పూర్తిగా లీనమై పనిచేశాం. ఈ నిర్మాణం అందుబాటులోకి వస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది' అని చక్రధర్ వివరించారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #MedaramJatara #MedaramJataraCelebration #India #BigFestivalInIndia #BigFestivalMedaramJatara #ModiSpeechAboutJatara